ఈటెల రాజేందర్ కారు బోల్తా..

తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కరీంనగర్ వెళుతుండగా మానకొండూరు సమీపానికి రాగానే ఓ టిప్పర్‌ను ఓవర్‌టేక్ చేయబోతూ దాన్ని తాకడంతో ఆయన ప్రయాణిస్తున్న వాహనం బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో మంత్రి ఈటెల రాజేందర్‌కు కాలుకి, ఛాతీ భాగంలో బలమైన గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు గన్‌మెన్ కూడా గాయపడ్డారు. వారిని ఎస్కార్ట్ వాహనంలో కరీంనగర్‌లోని అపోలో రిచ్ ఆస్పత్రికి తరలించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu