హరీష్ చీడ పురుగు: ఎర్రబెల్లి

 errabelli dayakar rao harish rao, errabelli dayakar  KCR, errabelli dayakar TRS,  harish rao TRS

 

 

టీఆర్ఎస్ పార్టీపై, ఆ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావుపై తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు విరుచుకపడ్డారు. హరీష్ టీఆర్ఎస్ లో ఓ చీడ పురుగన్నారు. వైయస్ బతికుంటే హరీష్ రావు కాంగ్రెసులో చేరి ఉండేవారన్నారు. తమ పార్టీని అణచేయడానికి టీఆర్ఎస్, కాంగ్రెసు కుమ్మక్కయి కుట్ర చేస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఎందుకు విమర్శించడం లేదని, తెలంగాణపై అఖిలపక్ష సమావేశం పెట్టాలని సోనియాను ఎందుకు అడగలేదని ఆయన ప్రశ్నించారు. సిద్ధిపేటలో ఓడిపోతాననే భయంతోనే కెసిఆర్ గతంలో కరీంనగర్‌లో పోటీ చేశారని ఆయన అన్నారు. దమ్ముంటే కెసిఆర్ మళ్లీ మహబూబ్ నగర్ నుంచి పోటీ చేయాలని ఆయన సవాల్ చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu