ఈ రంగాన్నైనా మిగల్చండి!
posted on Sep 21, 2012 6:29PM

నేడు ఏరంగంలోనైనా మనకు ఎంత వస్తోందనే తప్ప ఎంతవరకు తీసుకున్న దానికి న్యాయం చేశామన్న విషయమనే పట్టించుకోవడం లేదు. అందుకు ఉదాహరణలే డైట్ కాలేజీలు. గతంలో ప్రమాణాలు లేకపోయినా దొడ్డిదారిన ప్రమాణాలు పొంది ఎన్నో కాలేజీలు తమ కాలేజీలను నిర్వహించాయి. ఈ ఏడాది ప్రమాణాలు లేకుండా అలాగే కొనసాగటానికి కాలేజీల అనుమతులకు పట్టుబడుతున్నాయి యాజమాన్యాలు. సర్కారుపై ఒత్తిడులు పెరిగిపోతున్నాయి. ప్రమాణాల సంగతి ఎలా వున్నా బేరసారాలల్లో మాత్రం ఓ కొలిక్కి వస్తున్నాయని చెప్పుకుంటున్నారు. ఉపాధ్యాయ విద్య బోధనకు కావల్సిన నాణ్యమైన విద్య అందుబాటులోకి రావాలంటే డైట్ కాలేజీలను పటిష్టం పరచి నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చేలా చూడాలి. లేదంటే... ఇప్పటికే విద్యావ్యవస్థ వ్యాపారమయమైపోతోంది. అన్నిరంగాల్లోను అవినీతి క్యాబరే ఆడుతోంది. కనీసం ఈ రంగాన్నయినా నిజాయితీగా వుండనిస్తే మేలు. లేదంటే భావితరం భ్రష్టుపట్టి పోతుందని, ఉపాధ్యాయ విద్య నాణ్యతను కోల్పోతే రాబోయే కాలమంతా బోధనతో, పరీక్షలతో పనిలేకుండా విద్యను కొనుక్కోవడమే అవుతుందేమోనని విద్యాభిమానులు ఆందోళన చెందుతున్నారు.