ఇస్తే మంచిదే!
posted on Sep 21, 2012 6:22PM

రాష్ట్ర పర్యాటక శాఖకు చెందిన బస్సులకు రవాణా టాక్సు నుండి మినహాయించాలని ఎపి టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ యూనియన్ కార్మికులు రాష్ట్ర రవాణాశాఖా మంత్రిని కలిసి విజ్ఞప్తిచేశారు. వివిధ చారిత్రక ప్రదేశాలకు బస్సులను నడుపుతూ ప్రజల్లో టూరిజం పట్ల చైతన్యం, ఆసక్తిని కలిగిస్తున్న ఈ బస్సుల నిర్వహణ తాజాగా పెరిగిన రేట్ల నేపథ్యంలో పడిన భారం కారణంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ప్రధాన సంస్థగా ప్రభుత్వపరంగా ఈ సహాయం చేయాలని కోరారు. టూరిజంపరంగా రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెంది మరిన్ని ప్రాంతాలకు బస్సులను నడిపేలా రాయితీలను ప్రకటిస్తే ప్రభుత్వానికి లాభంతోపాటు, రాష్ట్ర పర్యాటకరంగం అభివృద్ది చెంది, తదనుగుణంగా ఆయా ప్రాంతాలు కూడా అభివృద్ధికి నోచుకుంటాయి.