రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న బంద్
posted on Sep 21, 2012 6:31PM

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు నిరసనగా వామపక్షాలు భారత్‌బంద్ పిలుపునిచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. డిపోల ఎదుట ఆందోళనలు చేస్తున్న పలువురు కార్యకర్తలు,నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు జిల్లాలో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రభుత్వ, ప్రైవేలు విద్యా, వాణిజ్య సంస్థలు మూతపడ్టాయి. అయితే హైదరాబాద్‌లో బంద్ పాక్షికంగా కొనసాగుతోంది. రోడ్లపై బస్సులు యథావిథిగా తిరుగుతున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలోని ఆర్టీసీ డిపో ఎదుట విపక్షాలు ధర్నా చేపట్టాయి. దీంతో జిల్లావ్యాప్తంగా బస్సులు నిలిచిపోయాయి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ డిపో ఎదుట ఆందోలన కారులు నిరసన తెలపడంటో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖపట్నం మద్దిలపాలెంలో విపక్షాలు రాస్తారోకో చేపట్టారు. నేషనల్ హైవేపై కార్యకర్తలు కబడ్డీ ఆట ఆడుతూ నిరసన తెలిపారు. విజయనగరం జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సాలూరు, బొబ్బిలి, పార్వతీపురంలో ఆందోళనకారులు వాహనాలను అడ్డుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు మూతపడ్డాయి. రైల్వే స్టేషన్‌లో హౌరా ఎక్స్‌ప్రెస్‌ను ఆందోళనకారులు అడ్డుకున్నారు. చిత్తూరు జిల్లాలో బంద్ కొనసాగుతోంది. డిపోలలో బస్సులు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. వ్యాపార, విద్యా సంస్థలు మూతపడ్డాయి.