ఏపీ లిక్కర్ స్కాం..రంగంలోకి ఈడీ?
posted on May 8, 2025 3:51PM

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం విషయంలో ఈడీ దర్యాప్తునకు రంగం సిద్ధమైందా అంటే.. అవుననే సమాధానమే వస్తోంది. ఈ కుంభకోణం నిగ్గు తేల్చడానికి ఈడీ రంగంలోకి దిగింది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు వివరాలు కోరుతూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఏపీ పోలీసులకు లేఖ రాసింది. ఈ కేసులో దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ సహా కేసు వివరాలన్నీ సమర్పించాల్సిందిగా ఈ లేఖలో ఈడీ ఏపీ పోలీసులను కోరింది. ఈ మేరకు ఈడీ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ కు, విజయవాడ పోలీస్ కమిషనర్ కు లేఖలు రాసింది.
ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టంచిన ఈ ఏపీ లిక్కర్ స్కాం దర్యాప్తునకు ఈడీ ఎంట్రీ కన్ఫర్మ్ అయ్యింది. ఎఫ్ఐఆర్ తో పాటుగా ఈ కేసులో ఇంత వరకూ జరిగిన దర్యాప్తు వివరాలు, సీజ్ చేసిన అక్కంట్ల వివరాలు, అలాగే ఈ నగదు లావాదేవీల వివరాలు, ఇంత వరకూ జరిగిన అరెస్టులు తదితర సమాచారాన్ని అందించాలని ఈడీ సిట్ చీఫ్, బెజవాడ పోలీస్ కమిషనర్ కు రాసిన లేఖలో కోరింది.
ఈ కేసు దర్యాప్తు ఈడీ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వా చాలా కాలంగా కోరుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పలు సందర్భాలలో ఈ కేసును ఈడీకి రిఫర్ చేస్తామని ెప్పారు. అవినీతి వ్యవహారంలో సిట్ చర్యలు తీసుకుంటుంది, కానీ మనీల్యాండరింగ్, అక్రమ నగదు లావాదేవీలు తదితర అంశాలు కూడా ఈ కేసులో బయటపడటంతో ఈడీ రంగంలోకి దిగక తప్పని పరిస్థితి ఏర్పడింది.