అమరావతి చట్టబద్దతపై ఏపీ మంత్రివర్గ తీర్మానం
posted on May 8, 2025 3:40PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించే తీర్మానానికి ఆమోదం తెలిపారు. భారత్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతంపై రాష్ట్ర కేబినెట్ కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపింది. సిందూర్ అనే పేరుతో అందరి సెంటిమెంట్‌ను టచ్ చేశారంటూ మంత్రివర్గం హర్షం వ్యక్తం చేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు పెట్టే సమయంలో అందరికీ దగ్గరయ్యేలా పేర్లు పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు.
ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పదేళ్ల కాల పరిమితి ముగియడంతో అమరావతి పేరిట గెజిట్‌పై కేంద్రాలని కోరాలని కేబినెట్ నిర్ణయించారు. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఆర్థిక సాయం పెంపు, రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి మెగా ఈవెంట్స్ నిర్వహించే ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది. మున్సిపల్ శాఖ 281 పనులను హైబ్రిడ్ యాన్యూటీ విధానంలో చేపట్టేందుకు ఆమోదం తెలిపింది. కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న 3 బిల్లులను వెనక్కి తీసుకునే ప్రతిపాదనకు అంగీకరించింది. 47వ సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. రాజధాని పరిధిలో వివిధ సంస్థలకు భూకేటాయింపులకు ఆమోదం తెలిపింది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ తదితర సంక్షేమ కార్యక్రమాలపై చర్చించింది. తీరప్రాంత భద్రత, రక్షణ రంగ పరిశ్రమల వద్ద జాగ్రత్తలు వంటి అంశాలపై సమీక్ష నిర్వహించింది.