ఫాల్కన్ స్కామ్.. తవ్వే కొద్ది పగులుతున్న అక్రమాల పుట్ట!

ఫాల్కన్ స్కామ్ లో తవ్వినకొద్ది కొత్త కొత్త విషయాలు వెలుగులోకి  వస్తున్నాయి. క్యాపిటల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ పేరిట కంపెనీ పెట్టి ఇన్‌వాయస్ డిస్కౌంటింగ్‌ ద్వారా భారీ లాభాలు వస్తాయని చిన్న, మధ్య తరగతి మదుపరులను నమ్మించి రూ.792 కోట్ల మోసానికి పాల్పడిన ఫాల్కన్ స్కామ్ కేసులోలో    చార్టర్డ్ అక్కౌంటెంట్   శరత్ చంద్ర టోస్ని వాలి కీలక పాత్ర పోషించినట్లు వెలుగులోకి వచ్చింది. శరత్ చంద్రను ఈడీ అధికారులు అరెస్టు చేశారు.

 లేని డబ్బుల్ని అకౌంట్లో ఉన్నట్లుగా చూపి తప్పుడు లెక్కలతో  చార్టెడ్ అక్కౌంటెంట్ శరత్ చంద్ర బురిడీ కొట్టించారని నిర్ధారించుకున్న ఈడీ ఆయనను అరెస్టు చేసింది. అయితే ఈ ఫాల్కన్ కంపెనీ చైర్మన్ అమర్ధీప్ మాత్రం దుబాయ్ కు పరారయ్యాడు. అయితే అమర్ దీప్ కు సహకారం, సహాయం అందించిన శరత్ చంద్ర ఈ స్కామ్ లో కేంద్ర బిందువు అని ఈడీ తేల్చి అరెస్టు చేసింది. హవాలా రూపంలో స్కాం సొమ్ములను విదేశాలకు తరలించడంలో శరత్ చంద్రదేకీకల పాత్ర ధాని అని ఈడీ దర్యాప్తులో తేలింది. పూర్తిస్థాయిలో సహాయం చేసిన చార్టెడ్ అకౌంటెంట్ శరత్చంద్ర ఈ స్కామ్ కు కేంద్ర బిందువుగా ఉన్నారని ఈడీ తేల్చింది.. హవాల రూపంలో డబ్బులు మొత్తాన్ని విదేశాలకు తరలించడంలో శరత్ చంద్ర కీలక సూత్రధారిగా ఉన్నారని ఈడి దర్యాప్తులో తేలింది. దీంతో  చార్టర్డ్ అకౌంటెంట్ శరద్ చంద్ర టోష్నీవాల్‌ను అరెస్ట్ చేసి. ప్రవెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ ప్రత్యేక కోర్టులో హాజరు పరచగా కోర్టు ఆయనను 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.  క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ స్కీమ్ పేరుతో పెట్టుబడి దారులను  .ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి, మోసం చేసి ఏకంగా 792 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడింది.

 ఈ స్కామ్‌కి ప్రధాన సూత్రధారి అయిన కంపెనీ యజమాని అమర్‌దీప్ కుమార్ కోసం శరత్ చంద్ర టోష్నీవాల్ పలు నకిలీ లావాదేవీలను నిర్వహించడంతో పాటు.. మనీలాండరింగ్‌లో కీలక పాత్ర పోషించినట్టు ఈడీ విచారణలో తేలింది. శరత్ చంద్ర తన బంధువుల పేర్లపై కంపెనీల్లో వాటాలు కూడా కొనుగోలు చేసినట్టు  చెబుతున్నారు.  ఈ కేసులో రూ. 18.14 కోట్ల ఆస్తులను ఈడి అటాచ్ చేసింది.. ప్రధాన నిందితుడు అమర్‌దీప్ కుమార్ సోదరుడు సందీప్ కుమార్‌ను కూడా ఈడీ అరెస్టు చేసింది.  చార్టెడ్ ఫ్లైట్లో దుబాయ్ కి పారిపోయిన అమర్దీప్ ను స్వదేశానికి రప్పించడం కోసం ఈడీ ప్రయత్నాలు ప్రారంభించింది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu