ఉప రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల
posted on Aug 1, 2025 1:05PM
.webp)
భారత ఉప రాష్ట్రపతి ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘంఈ ఎన్నికకు షెడ్యూల్ ను శుక్రవారం విడుదల చేసింది. సెప్టెంబర్ 9న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజున కౌంటింగ్ ప్రక్రియ చేపట్టి విజేతను ప్రకటిస్తారు. ఇక ఈ ఎన్నికకు నోటిఫికేషన్ ఆగస్టు 7న వెలువడుతుంది.
అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. నామినేషన్ దాఖలుకు తుది గడువు ఆగస్టు 21. అదే నెల 22న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఆగస్టు 25 కాగా సెప్టెంబర్ 9న ఉప రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ జరుగుతుంది. ఉదయం పది గంటల నుంచి 5 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. అదే రోజు కౌంటింగ్ నిర్వహించి ఫలితం వెలువరిస్తారు.