పబ్ లో పార్టీ అంటూ ఎర.. కట్ చేస్తే కిడ్నాప్.. బ్లాక్ మెయిల్!

పబ్బులో పార్టీ చేసుకుందామన్న ఓ కిలేడీ ఎరకు చిక్కుకున్నాడు.   పబ్బులో పార్టీ అనేసరికి ఆ యువకుడు ఎగిరి గంతేశాడు.. పబ్ కు రమ్మని పిలిచింది ఒక బార్లో డాన్సర్ గా పని చేసే లేడీ కావడంతో  ముందు వెనుక ఆలోచించకుండా  రాత్రి సమయంలో పబ్బుకు చేరుకున్నాడు.  అప్పటికే అక్కడ మాటు వేసిన కిలేడీకి చెందిన గ్యాంగ్  మాట్లాడుకుందామని చెప్పి పక్కకు తీసుకెళ్లి కిడ్నాప్ చేశారు. వివరాల్లోకి వెడితే..  సచిన్ దూబే  అనే వ్యక్తి  ఒక జ్యువెలరీ షాపులో పార్ట్నర్ గా ఉన్నాడు.. అతనికి డబ్బు కొదవలేదు. ఇదే అతనిని టార్గెట్ చేయడానికి కారణమైంది. పబ్ లో డ్యాన్సర్ గా పని చేసే యువతి అతడితో పరిచయం పెంచుకుని పబ్ కు ఆహ్వానించింది. ముందు వెనుకలాలోచించకుండా పబ్ కు కెళ్లిన సచిన్ దుబేని ఆ డ్యాన్సర్, ఆమె గ్యాంగ్ కిడ్నాప్ చేశారు.  

అతని దగ్గర ఉన్న బంగారు ఆభరణాలను దోచుకున్నారు.. ఆ తర్వాత ఒక వీడియోని చూపారు. ఒక యువతితో సచిన్ సరసాలు ఆడుతున్న సమయంలో తీసిన ఆ వీడియోతో బ్లాక్ మెయిల్ చేశారు.  ఆ వీడియోను  సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదరించారు. తాము అడిగిన 10 లక్షల రూపాయల డబ్బు ఇవ్వకపోతే వీడియోను సామాజిక మాధ్యమంలో  పోస్ట్ చేసి పరువు తీస్తామని బెదిరించారు  వీడియో ను  ఆసరాగా చేసుకొని ఒక బార్ లో డాన్సర్ గా పని చేస్తున్న లేడీ తో సహా పబ్బులో పనిచేసే యువకుడు, మరో ముగ్గురు కలిసి సచిన్ దూబే  కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. చివరికి విషయం పోలీసుల వద్దకు చేరడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.  బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 3 లో సచిన్ దూబే  కిడ్నాప్ కేసు లో ఒక యువతి  సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.  సచిన్ దుబేను కిడ్నాప్ చేసి హింసించడంతో పాటు అతని వస్తువులను లాక్కొని డబ్బులు  డిమాండ్ చేసిన నలుగురిని పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు.  

అత్తాపూర్ ప్రాంతానికి చెందిన సచిన్ దూబే బంజారా హిల్స్ లో ఒక జ్యువెలరీ షాప్ లో భాగస్వామి. సచిన్ మత్తులో ఉన్న సమయంలో ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియో ఐదుగురు సభ్యులు గల ముఠా వద్దకు చేరుకుంది.   ఈ వీడియోలు చూసిన తర్వాత గ్యాంగ్ కి సచిన్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాలని ఆశ పుట్టింది.  దీంతోఅతడిని కిడ్నాప్ చేసి 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్   చేశారు. సచిన్ ను కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేయడంతో పాటు   డబ్బులు డిమాండ్ చేసిన కేసులో  బార్ డ్యాన్సర్ డింపుల్ తో పాటు నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu