ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం..

ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. ఉదయం దక్షిణ ఫిలిప్పీన్స్‌లోని మిండానయోలోని ఫిలిప్పీన్స్‌ ద్వీపంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైంది. హినాటాన్ పట్టణానికి వాయువ్యంగా 12 కిలోమీటర్ల దూరంలో భూమికి పదికిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ఇళ్లలోంచి రోడ్ల మీదకు పరుగులు తీశారు. ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు అందాల్సి ఉంది. కొద్ది రోజుల క్రితం ఇటలీలో సంభవించిన భూకంపంలో 200 మంది ప్రాణాలు కోల్పోయారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu