హైదరాబాద్ పాతబస్తీలో తుపాకీ కాల్పులు
posted on Sep 4, 2016 12:59PM
.jpg)
హైదరాబాద్ పాతబస్తీలో కాల్పులు కలకలం సృష్టించాయి. గత నెల 22న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ వివాహ వేడుక సందర్భంగా నిర్వహించిన బరాత్‌లో గుర్రంపై వూరేగుతున్న వరుడు ఆనందం పట్టలేక రివాల్వర్‌తో గాల్లోకి కాల్పులు జరిపాడు. ఓకేసారి రెండు రివాల్వర్లతో ఆరు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఆగస్టు 22న రాత్రి 10 గంటలకు ఘటన జరిగితే ఇంతవరకు పోలీసులు స్పందించలేదు. కారణం కాల్పులు జరిపిన వరుడు ఓ పోలీస్ అధికారి సమీప బంధువు కావడమే. తొలుత ఎలాంటి కాల్పులు జరగలేదన్న సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ..అనంతరం కాల్పుల దృశ్యాలు వెలుగులోకి రావడంతో దర్యాప్తుకు ఆదేశించారు. పాతబస్తీలోని షామా ధియేటర్ ఎదుట కాల్పుల ఘటన జరిగినట్టు పోలీసులు గుర్తించారు.