అమెరికాలో భారీ భూకంపం

 

అమెరికాలో భారీ భూకంపం సంభవించింది. దక్షిణ కాలిఫోర్నియాలో భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 7.1గా నమోదైంది. అమెరికాలో గడచిన 25 సంవత్సరాల్లో ఎన్నడూ రానంత భారీ భూకంపం ఇదేనని అంటున్నారు. భూకంపాన్ని చూసిన ప్రజలు తీవ్ర భయాందోళనతో వీధుల్లోకి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇక సూపర్ మార్కెట్స్, మాల్స్ లోని సరుకులన్నీ కిందపడగా, రోడ్లన్నీ బీటలు వారాయి. లాస్‌ ఏంజెల్స్‌కు 202 కిలోమీటర్ల దూరంలో భూకంపకేంద్రం ఉందని అధికారులు వెల్లడించారు. అయితే గురువారం నాడు కూడా 6.4 తీవ్రతతో ఇదే ప్రాంతంలో భూకంపం రాగా పెద్దగా నష్టం జరగలేదు. కానీ నిన్న జరిగిన భూకంపం ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో ఇళ్లకు భారీగానే నష్టం జరిగినట్టు తెలుస్తోంది. కొన్ని ఇళ్ల పునాదులు బీటలు వారడం కనిపిస్తోంది. అయితే మరో సారి భూకంపం వచ్చే అవకాశాలున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu