శ్రీ హరి మరణానికి అసలు కారణం బయట పెట్టిన డిస్కో శాంతి !

 

రియల్ స్టార్ శ్రీ‌హ‌రి మరణం...కేవలం ఇండస్ట్రీ వర్గాలకే కాక అనేక మంది జనాలను శోక సంద్రంలోకి ముంచిన విషయం అది. ఆయన లాంటి మంచి మనసున్న వ్యక్తి దూరం అవడం ఎవరూ జీర్ణించుకోలేక‌పోయారు. అంతటి నిండైన రూపమున్న మనిషి ప్రాణం లేకుండా పడి ఉన్నాడంటే ఎవరూ నమ్మలేదు. అయితే అసలు  శ్రీ‌హ‌రి ఎలా చ‌నిపోయాడు ? అప్ప‌టి వ‌ర‌కు బానే ఉన్న ఆయ‌న ముంబైకి వెళ్లి ఎలా చ‌నిపోయాడనే ప్ర‌శ్న‌లు దాదాపు అందరినీ వెంటాడుతూ ఉంటాయి. 

అయితే ఈ విషయం మీద రాజ్ దూత్ సినిమా ప్ర‌మోష‌న్స్ సందర్భంగా ఆయన భార్య డిస్కో శాంతి స్పందించారు. ఆయన చనిపోయిన రోజు రాజ్ కుమార్ సినిమా షూట్ కోసం ముంబై వెళ్లి హోటల్ లో దిగామని కాస్త ఒంట్లో నలతగా ఉంద‌ని చెప్ప‌డంతో డాక్ట‌ర్‌కు ఫోన్ చేసి చెప్పామ‌ని ఆమె చెప్పింది. అయితే వచ్చిన డాక్ట‌ర్ ఏదో ఇంజెక్ష‌న్ ఇచ్చాడని తాను ఫ్యామిలీ డాక్ట‌ర్‌ను అడిగి ఇంజెక్ష‌న్ ఇవ్వమని చెప్పేలోపే ఇంజెక్షన్ ఇచ్చేశారని ఆమె చెప్పుకొచ్చింది. 

తాను నైటీలో ఉండ‌టంతో లోప‌లికి వెళ్లి బ‌ట్ట‌లు మార్చుకుని వ‌చ్చేలోపే శ్రీహరిని లీలావ‌తి హాస్పిట‌ల్ తీసుకెళ్లార‌ని, వెంట‌నే తాను కూడా ఆస్ప‌త్రికి వెళ్లాన‌ని అయితే తను వెళ్ళే లోపలే ఆయన్ని ఐసీయూలో పెట్టారని, త‌న‌ను క‌నీసం లోప‌లికి కూడా వెళ్లనివ్వ‌లేద‌ని చెబుతూ ఆమె భావోద్వేగానికి గుర్యయింది. అయితే తాను దొంగ‌త‌నంగా లోప‌లికి వెళ్లాన‌ని అయితే అప్పటికే శ్రేహరి ర‌క్తంలో త‌డిసిపోయి ఉన్నాడ‌ని అది చూసి తాను గ‌ట్టిగా ఏడ్చేసాన‌ని దాంతో డాక్ట‌ర్లు త‌న‌ను బ‌ల‌వంతంగా బ‌య‌టికి పంపేశార‌ని చెప్పుకొచ్చిందీమె. 

ఇక ఆరోజు రాత్రి 9.30 ప్రాంతంలో మ‌రోసారి లోప‌లికి వెళ్లి చూసేస‌రికి డాక్ట‌ర్లు ఏదో త‌ప్పు చేసార‌ని అర్థ‌మయింద‌ని, త‌ప్పు జ‌రిగింద‌ని బ‌తిమాలుకుంటున్న‌ట్లు అర్ధంయ్యిందని ఆమె చెప్పుకొచ్చింది. అయితే శ్రీ హరికి లివర్ స‌మ‌స్య ఉంద‌ని అది తెలియక వీరు పైప్ నేరుగా పెట్ట‌డంతో అది వెళ్లి లివ‌ర్‌ కి గుచ్చుకుని ర‌క్తస్రావం అయ్యిందని ఆరోజున డాక్ట‌ర్లు చేసిన త‌ప్పుకు శ్రీ హరి తనకే కాక ప్రపంచానికి కూడా దూరం అయ్యాడని ఆమె మళ్ళీ కన్నీళ్లు పెట్టుకున్నారు. అంటే డాక్టర్ లు చేసిన పొరపాటుకి ఆయన తనువు చాలించాడన్న మాట.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu