ఇంతకాలం లేని సమస్య ఇప్పుడే ఎందుకు? కేసీఆర్ వరి యుద్ధంపై అనుమానాలు

అంతా అదే.. సేమ్ టూ సేమ్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, తెరాస అధికారంలోకి వచ్చిన ఎనిమిదేళ్ల కాలంలో... ఎక్కడా ఎలాంటి మార్పు లేదు. అక్కడ కేంద్రంలో బీజేపీనే అధికారంలో వుంది. నరేంద్ర మోడీనే ప్రధానిగా ఉన్నారు. ఇక్కడ తెలంగాణలో తెరాసనే అధికారంలో వుంది కేసీఆర్, అనే కల్వకుట్ల చంద్రశేఖర రావే, ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పటికీ ఇప్పటికీ ధాన్యం సేకరణ విధానంలో ఏమైనా మార్పులు వచ్చాయా, అంటే అదీ లేదు. అయినా,ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర  రాష్ట్ర  ప్రభుత్వాల మధ్య వివాదం రాజుకుంది.
ఈ నేపధ్యంలో ఇంతవరకు లేని సమస్య ఇప్పుడు ఎందుకు తలెత్తింది? కేంద్ర  రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎందుకు ‘వరి’ మంటలు పుట్టిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బేజీపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస పార్టీల మధ్య ఇంత పెద్ద ఎత్తున ‘యుద్ధం’ ఎందుకు జరుగుతోంది?ఒకరిపై ఒకరు ఎందుకు సభ్యతా సంస్కారం పక్కన పెట్టి, దూషణలకు దిగుతున్నారు. నిజానికి ఇదేమి, భేతాళ ప్రశ్న కాదు. 

నిజానికి అసలు సమస్య ధాన్యం సేకరణ కానేకాదు. ధాన్యం సేకరణ విషయంలో కొత్తగా వచ్చిన్ సమస్య న్తూ ఏదీ లేదు.  భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)ఎన్నో ఏళ్లుగా, ఎన్నో దశాబ్దాలుగా అనుసరిరిస్తున్న ధాన్యం సేకరణ పద్దతులనే ఇప్పటికీ, అనుసరిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఒకే విధానం అమలవుతోంది. పంజాబ్’కో విధానం, తెలంగాణకు మరో విధానం అమలు కావడం లేదు.అది పంజాబ్ అయినా,తెలంగాణ అయినా, ఎఫ్‌సీఐతో ఒప్పందం చేసుకుని తదనుగుణంగా రైతుల నుంచి ధాన్యం సేకరించి, ఎఫ్‌సీఐకి బియ్యం సరఫరా చేస్తుంది. ఇందుకు అయ్యే ప్రతి పైసా ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఇదే పద్దతిని, గత సంవత్సరం వరకు తెలంగాణ ప్రభుత్వం కూడా అనుసరించింది. ఏనాడూ, ఇదిగో ఈ ఇంబ్బంది ఉందన్న పాపాన పోలేదు. చక్కగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చికాగోరింకల్లా,చీకూచింతలు లేని సంసారం సాగిస్తూ వచ్చాయి.  

అయినా, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కేంద్రంపై కత్తులు దూస్తోంది? ఎందుకు ఒకరిపై ఒకరు బురద జల్లు కుంటున్నారు? అయినా, అసలు గడచిన ఏడేళ్ళలో ఎప్పుడైనా, రైతులు పండించిన పంటను కొనేది, రాష్ట్రం కాదు కేంద్రం అనే మాట ఎక్కడైనా వినిపించిందా?  రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఫెసిలిటేటర్ (సంధానకర్త)గా మాత్రమే వ్యవహరిస్తుందని, ముఖ్యమంత్రి కానీ, మాత్రులు కానీ, ఏనాడైనా చెప్పారా? లేదే, పైగా ముఖ్యమంత్రి స్వయంగా శాసనసభలో రైతులు ఎంత పంట పండించినా హ్యాపీ గా కొంటామని, ప్రకటించారు.మరి ఇప్పుడు ఎందుకు ఇలా...గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేస్తామని ముఖ్యమంత్రి మాట మార్చారు? ఎందుకు, కేంద్రంతో కోరి కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే, అందుకు ఒకటే ఒక్క కారణం కనిపిస్తోందని, పరిశీలకులు అంటున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత, ముఖ్యమంత్రి కేసీఆర్’లో మార్పు వచ్చింది. ఆయనలో ముందున్న విశ్వాసం సన్నగిల్లింది. ఇక సెంటిమెంట్’ పనిచేయదని తేలిపోయింది. అందుకే,కేసీఆర్  వ్యూహం మార్చారు, తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, కేంద్రపై యుద్దాన్ని  ప్రకటించారని, పరిశీలకులు అంటున్నారు. 

అదొకటి అలా కేంద్ర ప్రభుత్వం నుంచి మరో ముప్పును కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉహించి భయపడుతున్నరని అంటున్నారు. రాష్ట్రంలో కాళేశ్వరం తదితర సాగునేటి ప్రాజెక్టుల నిర్మాణంలో, భూముల వ్యవహారంలో ఇతరత్రా చాలా పెద్ద ఎత్తున లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ ఎప్పటినుంచో ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు తెరాస ప్రభుత్వ అవినీతిపై దృష్టి కేంద్రీకరించాయనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే. కీలక నేతలకు సంకెళ్ళు సిద్దమవుతున్న సంకేతాలు వినవస్తున్నాయి. ఈ నేపద్యంలో ఆత్మరక్షణలో పడిన ముఖ్యమంత్రి కేసీఅర్’ కేంద్రం పై  యుద్ధం  పేరిట అసలు సమస్యలను, సవాళ్ళను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. అయితే, జరుగుతున్న పరిణామాలను గమినిస్తే, కేసీఆర్ కేంద్రంఫై ప్రకటించిన యుద్ధం’ బూమ్రాంగ్ అవుతున్న వైనమే కనిపిస్తోంది అనిపిస్తోందని, పరిశీలకులు అంటున్నారు. అయితే, రేపు ఏమి జరుగుతుంది, అనేది మాత్రం ప్రస్తుతానికి ఎవరి అంతుచిక్కడం లేదని, అంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu