‘వర్మ సరళా ఆంటీ’ ఎవరబ్బా?
posted on Sep 17, 2014 2:18PM
.jpg)
హిట్టో... ఫట్టో... రామ్‌గోపాల్ వర్మ ఏ సినిమా తీసినా ఆ సినిమా గురించి జనాల్లో చర్చ జరుగుతూనే వుంటుంది. వర్మ కూడా పరమ చెత్త సినిమా తీసి కూడా, ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయినా కూడా నాలుగు డబ్బులు జేబులో వేసుకుంటున్నాడు. అలాగే తాను ఏ సినిమా తీసినా విచిత్రమైన టైటిల్స్‌తో, వెరైటీ ప్రచారంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇప్పుడు వర్మ చేస్తున్న అలాంటి ప్రయత్నమే ‘వర్మతో సరళా ఆంటీ’ సినిమా. వర్మ ఈ పేరుతో సినిమా తీస్తున్నట్టు ప్రకటించగానే అందరిలో ఆసక్తి రేగింది. ముఖ్యంగా యూత్ అయితే తాము కోరుకునే మంచి మసాలా సినిమా వర్మ నుంచి రాబోతోందని అనుకున్నారు. ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుందా అన్నట్టుగా వుంది యూత్ పరిస్థితి. ఇదిలా వుంటే ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ‘సరళా ఆంటీ’ పాత్రను ఎవరు ధరించబోతున్నారన్న అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఒక ప్రముఖ నటి సరళా ఆంటీగా నటించోబోతున్నట్టు వర్మ చెప్పారు. దాంతో ఇప్పుడు ‘ఆంటీ’ అయిన మాజీ హీరోయిన్లలో ఎవరు ఈ పాత్ర ధరించే అవకాశం వుందా అనే ఆలోచనలు టాలీవుడ్‌లో నలుగుతున్నాయి.