త్వరలో డిగ్గీ, అమృత పీపీపీ డుండుండుం!
posted on Jun 24, 2014 7:06PM
.jpg)
టీవీ యాంకర్ అమృతారాయ్‌తో కొనసాగుతున్న సంబంధం బయటపడిపోవడంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తాను ఆమెను పెళ్ళి చేసుకోబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. దిగ్వింజయ్ సింగ్‌తో అమృతారాయ్ అత్యంత సన్నిహితంగా వున్న ఫొటోలు కూడా బయటపడి సంచలనం రేగింది. తాజాగా ఈ జంటకు సంబంధించిన పెళ్ళి వార్త బయటకి వచ్చింది. త్వరలో ఈ జంట పెళ్ళి పీటల మీద కూర్చోబోతోందట. ఈ విషయాన్ని దిగ్విజయ్ సింగ్ తమ్ముడి భార్య రుబినా శర్మ ట్విట్టర్ ద్వారా తెలిపారు. త్వరలోనే తమ ఇంట్లో పెళ్ళి బాజాలు మోగనున్నాయని దిగ్విజయ్ సోదరుడు లక్ష్మణ్ సింగ్ భార్య రుబినా శర్మ సామాజిక వెబ్‌సైట్ ట్విట్టర్లో పేర్కొన్నారు. దిగ్విజయ్ సింగ్ భార్య క్యాన్సర్ కారణంగా గత ఏడాది ఫిబ్రవరిలో కన్నుమూశారు. దిగ్విజయ్‌కు ఓ కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఇప్పుడు ఈయన మరో పెళ్ళికి రెడీ అవుతున్నాడు.