డిగ్గీ, అమృత పెళ్ళిపై మరదలి వెటకారం ట్విట్
posted on Jun 24, 2014 7:37PM
.jpg)
టీవీ యాంకర్ అమృతారాయ్‌తో దిగ్వింజయ్ సింగ్ సంబంధం బయటపడినప్పటి నుంచి ఆయన బంధువర్గంతో దిగ్విజయ్ సింగ్ విలువ పోయింది. అంతకుముందు వరకూ ఎంతో బిల్డప్పుగా వుండే దిగ్విజయ్ సింగ్ అంటే ఆయన బంధుగణం మొత్తం భయపడిపోయేవారు. ఇప్పుడు ఆయన్ని ఎవరూ అంతగా లెక్కచేయడం లేదు. త్వరలో దిగ్విజయ్ సింగ్, అమృతా రాయ్ పెళ్ళి పీటల మీద కూర్చోబోతున్నారంటూ దిగ్విజయ్ సింగ్ మరదలు రుబీనా ట్విట్టర్‌లో వెటకారం కామెంట్ పెట్టారు. రుబీనా శర్మ దిగ్విజయ్ సింగ్ తమ్ముడు లక్ష్మణ్ సింగ్‌కి భార్య. గతంలో లక్ష్మణ్ సింగ్ రుబినా శర్మని ప్రేమించి పెళ్ళి చేసుకున్నప్పుడు దిగ్విజయ్ సింగ్ ఆమెని ఆమోదించకుండా కుటుంబానికి దూరంగా పెట్టాడట. తమ్ముడి ప్రేమ పెళ్ళిని తీవ్రంగా వ్యతిరేకించడట. ఆ కోపాన్ని మనసులో పెట్టుకున్న రుబీనా ఇప్పుడు దిగ్విజయ్ మీద వెటకారాలు పోతోంది.