సుబ్బిరామి రెడ్డి ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నిరసనలు

నెల్లూరు లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కళాబంధు టి.సుబ్బిరామిరెడ్డికి వ్యతిరేకంగా తెలంగాణా ప్రాంతంలో ఉద్యమాలు జరుగు తున్నాయి. ఆయనకు నిజామాబాద్ జిల్లా కామారెడ్డి పట్టణానికి సమీపాన సదాశివనగర్ లో ఒక షుగర్ ఫ్యాక్టరీ, డిస్టిలరీ ఉన్నాయి. వీటి నుంచి వెలువడుతున్న కాలుష్యం కారణంగా స్థానిక ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. భూగర్భజలాలు కలుషితయ్యాయని తెలంగాణవాద పార్టీలు, సంస్థలు ఆరోపిస్తున్నాయి. వీటిని మూసేయాలంటూ గత పదిహేను రోజులుగా ధర్నాలు కూడా జరుగుతున్నాయి. సుబ్బిరామిరెడ్డి తమ ప్రాంతప్రజలను కాలుష్యానికి గురిచేసి ఇక్కడ సంపాదించిన లాభాలతో నెల్లూరు లోక్ సభ ఎన్నికల్లో ఖర్చుపెడుతున్నారని వారు విమర్శిస్తున్నారు. పది నుంచి 15 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఇక్కడ కాలుష్యసమస్య తీరిపోతుందని, కానీ, సుబ్బిరామిరెడ్డి అలా చేయకుండా సినీతారలకు సన్మానాలు , ఎన్నికలు అంటూ కోట్లాదిరూపాయలు ఖర్చు పెడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. సీమాంధ్రుల దోపిడీకి, నిర్లక్ష్యానికి, స్వార్థానికి ఇది ఒక ఉదాహరణ అని వారు అంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu