రైలు ప్రమాదంలో 25కి చేరిన మృతుల సంఖ్య
posted on May 22, 2012 1:20PM
మంగళవారం తెల్లవారు జామును ఆగి ఉన్న గూడ్స్ రైలును హంపీ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొనడంతో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మరణించినవారి సంఖ్య 25కి చేరింది. ప్రమాదంలో 300 మంది దాకా గాయపడ్డారు. వీరిలో 50 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రైలు ప్రమాదంలో గాయపడినవారిని పెనుకొండ, హిందూపురం ఆస్పత్రులకు తరలించారు తీవ్రంగా గాయపడిన ముగ్గురిని చికిత్స నమిత్తం పుట్టపర్తి సత్యసాయి ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గ్యాస్ కట్టర్ల ద్వారా అత్యవసర ద్వారాలు తొలగించి బాధితులను బయటకు తీస్తున్నారు. జిల్లా కలెక్టర్ దుర్గాదాస్, జాయింట్ కలెక్టర్ అనితా రామచంద్రన్, డిఐజి చారు సిన్హా, ఎస్పీ ఖాన్ సంఘటనా స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.