తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.30 కోట్లు

కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దేశంలో వివిధ ప్రాంతాలు, విదేశాల నుంచి కూడా భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం కోసం పోటెత్తుతున్నారు. బుధవారం (ఆగస్టు 20) తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 30 కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 15 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది.

అలాగే ఎస్ఎస్ డి టోకెన్లు తీసుకున్న భక్తులకు స్వామి వారి దర్శనానికి ఆరు గంటలకు పైగా సమయం పడుతోంది.  ఇక మంగళవారం స్వామి వారిని మొత్తం 76 వేల 33 మంది దర్శించుకున్నారు. వారిలో  26,905 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదా యం 5 కోట్ల 30 లక్షల రూపాయలు వచ్చింది.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu