తండ్రికి తగ్గ తనయుడు నుంచి తండ్రి స్థాయిని అందుకున్న నాయకుడు.. లోకేష్

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి  నారా లోకేష్ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా రాజకీయంగా ఎదుగుతున్న తీరు ప్రత్యర్థి పార్టీలకు వణుకు పుట్టిస్తుంటే.. జనసామాన్యం ఆనందాశ్చర్యలకు గురౌతున్నారు.  పార్టీ సీనియర్ నాయకులు,  మంత్రులు,  ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులూ లోకేష్ నాయకత్వంపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే లోకేష్ మాట తీరు, ప్రజలలో మమేకమౌతున్న విధానంతో ప్రజానేతగా దాదాపు అందరూ అంగీక రిస్తున్నారు. ఇటు పార్టీలో, ప్రజలలో అభిమానం పెంచుకోవడమే కాదు, అటు హస్తినలో కూడా రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం చేస్తున్న పర్యటనలతో జాతీయ స్థాయిలో లోకేష్ గుర్తింపు పొందుతున్నారు. సమర్థ నాయకుడిగా అందరి ఆమెదం, అంగీకారం పొందారు.  

అయితే నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత తేలిగ్గా రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి. పొలిటికల్ గా నారా లోకేష్ తొలి పలుకులు కూడా బయటకు రాకూడదన్న ప్రయత్నాలు జరిగాయి. పప్పు అన్నారు. బాడీ షేమింగ్ చేశారు. హేళన చేశారు. టార్గెట్ చేసి మరీ క్యారెక్టర్ అసాసినేషన్ కు ప్రయత్నించారు. ఇదంతా ఎందుకు?  పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లుగా,  నారా లోకేష్ తండ్రి చాటు బిడ్డగా ఉన్నప్పుడు పార్టీ ప్రగతి కోసం తన ఆలోచనలకు పదు ను పెట్టారు. అలా పదును పెట్టడం ద్వారా వచ్చినవే పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్, సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నగదు బదిలీ. దీంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తే తమ ఉనికే ప్రమాదంలో పడుతుందన్న భయంతో ప్రత్యర్థి పార్టీలు.. ఆయనపై  ఎటాక్ ప్రారంభించాయి. మానసికంగా ఆయన స్థైర్యాన్ని దెబ్బతీసి రాజకీ యాలకు దూరం చేయాలని ప్రయత్నించాయి.  ప్రణాళికాబద్ధంగా ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి ప్రయత్నించాయి.  

అయితే లోకేష్ వెనకడుగు వేయలేదు. ప్రత్యర్థుల విమర్శలను, మాటల దాడులను, హేళనలను ఎదుర్కొంటూ ముందడుగు వేశారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎదిగారు. ప్రత్యక్ష ఎన్నికలలో తొలి ప్రయత్నంలో పరాజయం పాలైనా కృంగిపోలేదు. పడిలేచిన కెరటంలా ఎదిగారు. ప్రతికూలతలను దీటుగా ఎదుర్కొని సంక్షోభాల్ని అవకాశంగా మల్చుకోవాలన్న తండ్రి మాటల స్ఫూర్తితో  ముందుకు సాగారు. పట్టుదలతో  తనను తాను మేకోవర్ చేసుకున్నారు. ప్రజా నేతగా ఎదిగారు. తండ్రికి తగ్గ తనయుడే కాదు.. తండ్రిని మించిన తనయుడు అన్న నమ్మకాన్ని విశ్వాసాన్ని పార్టీనేతలు, శ్రేణులలోనే కాదు జనంలో కలిగించారు.  

తాజాగా లోకేష్ తన హస్తిన పర్యటనలో కేంద్ర మంత్రులతో, ఎన్డీయే మిత్రపక్షాల నేతలతో వరుస భేటీలూ, రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం వారితో చర్చించిన తీరు తరువాత భవిష్యత్ లో ఎన్డీయేలో నారా లోకేష్ మరింత కీలకంగా మారుతారనడంలో సందేహం లేదన్న భావన సర్వత్రా కలుగుతోంది. విశ్లేషకులు సైతం అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు తరహాలో ఆయన అభివృద్ధి, సంక్షేమం, సాంకేతికత అందిపుచ్చుకోవడంలో జాతీయ స్థాయిలోనే ముందు వరుసలో నిలుస్తున్నారు.   మిత్రపక్షాల నాయకులను సమన్వయం చేయడంతో పాటు టిడిపి ప్రాధాన్యాలను మరింత పెంచే దిశగా లోకేష్ ముందుకు సాగుతున్నారు. 

ఇక ఢిల్లీలో తెలుగుదేశం ఎంపీలు, జనసేన ఎంపీలతో ఆయన సమావేశాలు నిర్వహించారు. అంతే కాదు జాతీయ స్థాయిలో  ఎన్డీఏ మిత్రపక్షాల కీలక నేతలతో భేటీలలో రాష్ట్రం గొంతు బలంగా వినిపించారు.   గతంలో తనపై విమర్శలు చేసి ఎగతాళి చేసిన వారే శభాష్ లోకేష్ అనిపించుకునేలా ఎదిగారు. లోకేష్ తాజా హస్తిన పర్యటన ఆయన పరిణితికి, సమర్థతకు, రాష్ట్రప్రయోజనాల పట్ల ఆయనకు ఉన్నశ్రద్ధకు అద్ధం పట్టింది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu