తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు
posted on Aug 10, 2025 10:05AM
.webp)
కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న తిరుమల క్షేత్రంలో వేంకటేశ్వరుడి దర్శనం కోసం భక్తుల నిత్యం పోటెత్తుతుంటారు. వారాంతంలో భక్తుల రద్దీ మరింత అధికంగా ఉంటుంది. ఆదివారం (ఆగస్టు 10) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండి ఉన్నాయి.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శనివారం శ్రీవారిని మొత్తం 84 వేల 404 మంది దర్శించుకున్నారు. వారిలో 34 వేల 930 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 6 లక్షల రూపాయలు వచ్చింది.
ఇలా ఉండగా ఆదివారం (ఆగస్టు 10) ఉదయం చిరుజల్లులతో తిరుమలలో వాతావరణం ఆహ్లాదభరితంగా ఉంది. చిరుజల్లులలో తిరుమల గిరుల సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ భక్తులు గోవిందనామస్మరణ చేస్తూ తన్మయు లౌతు న్నారు.