బెంగళూరులో కొత్త క్రికెట్ స్టేడియం.. సీఎం సిద్దరామయ్య గ్రీన్ సిగ్నల్

భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విషాద సంఘటన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కసలాట. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ విజయం తరువాత చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించిన విజయోత్సవం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మరణాలు సంభవించాయి. ఈ విషాద సంఘటన తరువాత నగరం నడిబొడ్డున ఉన్న స్టేడియంలో మ్యాచ్ ల నిర్వహణ, జనాలను కంట్రోల్ చేయడం కష్టమని భావించిన కర్నాటక ప్రభుత్వం  బెంగళూరు శివార్లలోని  బొమ్మసాంద్ర ప్రాంతంలో కొత్త క్రికెట్ స్టేడియం నిర్మాణానికి  శ్రీకారం చుట్టింది.  1650 కోట్ల రూపాయల వ్యయంతో దాదాపు 80 వేల మంది ప్రేక్షకుల కూర్చునే కెపాసిటీతో భారీ స్టేడియం నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకు కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.  

ఈ మెగా క్రికెట్ స్టేడియం ప్రాజెక్ట్ కు పాలనాపరమైన అనుమతులే కాకుండా, నిధుల విడుదలకూడా జరగడంతో త్వరలోనే   నగరం నడిబొడ్డున ఉన్న చిన్నస్వామి స్టేడియం నుండి శివార్లలో ఉన్న బొమ్మసాంద్రలోని కొత్త స్టేడియంకు క్రికెట్ మ్యాచ్ లు తరలిపోనున్నాయి. ఈ కొత్త స్టేడియం   దాదాపు 80,000 మంది కూర్చునే సామర్థ్యంతో. ఆధునిక సౌకర్యాలతో ఉంటుంది. చిన్న స్వామి స్టేడియం సామర్థ్యం 40 వేలు మాత్రమే.. అంటే ఈ కొత్త స్టేడియంలో అంతకు రెట్టింపు మంది ప్రేక్షకులు మ్యాచ్ లు వీక్షించే అవకాశం కల్పిస్తుంది.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu