పిఠాపురంలో పవన్ పర్యటన నేడు
posted on Oct 9, 2025 9:15AM
.webp)
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గురువారం (అక్టోబర్ 9)న తన సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన భాగంగా ఉప్పాడ ప్రాంత మత్స్యకారులు ఎదుర్కొం టున్న సమస్యలను తెలుసుకుంటారు. ఉప్పాడ ప్రాంత మత్స్యకారులు చాలా కాలంగా సముద్ర కాలుష్యం వల్ల జీవనోపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని వారు పవన్ కల్యాణ్ దృష్టికి కూడా తీసుకువచ్చారు. దీంతో ఉప్పాడ ప్రాంత మత్స్యకారుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు పవన్ కల్యాణ్, అధికారులతో కలిసి పడవలో సముద్రంలో ప్రయాణించి కాలుష్య ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు.
తరువాత ఆయన ఉప్పాడలో మత్స్యకారులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఉప్పాడ తీర ప్రాంతంలో కాలుష్యంపై మత్స్య కారుల ప్రతినిధులు, అధికారులతో కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అలాగే ఈ పర్యటనలో ఆయన పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. పవన్ కల్యాణ్ పర్యటన సందర్భంగా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.