యూపీలో బ్రహ్మోస్ క్షిపణి యూనిట్‌ను ప్రారంభించిన రాజ్ నాథ్ సింగ్
posted on May 11, 2025 3:30PM

పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకున్నామని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఉగ్రవాద నిర్మూలకు ఆపరేషన్ సిందూర్ చేపట్టామని.. పాకిస్థాన్ ఉగ్రవాద నిర్మూలనకు గట్టి సమాధనం ఇచ్చామని ఆయన అన్నారు. యూపీలో బ్రహ్మోస్ క్షిపణి ఉత్పత్తి కేంద్రాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు. రూ.300 కోట్లతో 80 హెక్టార్ల స్థలంలో బ్రహ్మోస్ తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తున్నమని ఆయన అన్నారు.
ఉగ్ర శక్తులకు భారత్ దీటుగా బదులిస్తుందన్నారు. ఈ ఆపరేషన్ ఉగ్రవాదంపై పోరులో దృఢ సంకల్పంతోపాటు మన సైనిక శక్తి సామర్థ్యాలను చాటిచెప్పిందన్నారు. పహల్గాం బాధితులకు న్యాయం చేకూరిందన్నారు. పాక్ ప్రజలపై భారత్ దాడి చేయలేదని, కానీ, దాయాది మాత్రం పౌరులే లక్ష్యంగా మన దేశంపై దాడులు చేసిందన్నారు. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా బ్రహ్మోస్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. మూడున్నరేళ్లలో ప్లాంట్ నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు.