పీవోకే‌ను భారత్‌కు అప్పగించాల్సిందే..ప్రధాని మోదీ కీలక ప్రకటన

 

ప్రధాని మోదీ సంచలన ప్రకటన చేశారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని ప్రధాని స్పష్టం చేశారు. పాకిస్థాన్ కాల్పులు జరిపితే భారత్ కూడి ప్రతి దాడి చేస్తుందని తేల్చి చెప్పారు. ఈ మేరకు త్రివిధ దళాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పాక్‌తో పీవోకే, ఉగ్రవాదులను అప్పగించడం తప్ప మరే అంశంపై చర్చలు అవసరం లేదని తెలిపారు. ఈ విషయంలో ఇతర దేశాల జోక్యం అంగీకరించేది లేదని మోదీ తెలిపారు.ఈ మేరకు మోదీ నివాసంలో జరిగిన భేటీలో త్రివిధ దళాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. భారత ఆర్మీ చేసిన యుద్దంలో పాకిస్థాన్ పూర్తిగా ధ్వంసమైందని ప్రధాని అన్నారు. సైనిక బలగాలు చేసిన ప్రతి దాడిలో పాక్ ఓడిపోయిందని తెలిపారు. దాయాది ఎయిర్‌బేస్‌లపై మనం చేసే దాడులతోో  వాళ్లు అసలు యుద్ధంలోనే లేరని విషయం అర్థమైందని ఎద్దేవా చేశారు. 

దాడుల ద్వారా పాక్‌కు గట్టి సందేశం ఇచ్చామని మోదీ తెలిపారు. ఆపరేషన్‌ సిందూర్‌  అనంతరం పాకిస్థాన్‌ దుశ్చర్యల కారణంగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిన సరిహద్దు గ్రామాల ప్రజలకు కీలక అడ్వైజరీ జారీ చేశారు. ప్రజలు అప్పుడే తిరిగి తమ ఇళ్లకు తిరిగి రావొద్దని.. సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని కోరారు. పాకిస్థాన్‌ ప్రయోగించిన ఫిరంగి గుండ్లు (షెల్స్‌)నుంచి ఈ ప్రాంతాలను గుర్తించి శానిటైజ్‌ చేయాల్సి ఉందని తెలిపారు. 

పాక్‌ దాడుల తీవ్రతకు అధికంగా నష్టపోయే అవకాశం ఉండటంతో బారాముల్లా, బందిపొరా, కుప్వారా జిల్లాల్లోని నియంత్రణ రేఖ సమీపంలోని గ్రామాలకు చెందిన దాదాపు 1.25లక్షల మందికి పైగా ప్రజలను భద్రతా సిబ్బంది ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించిన విషయం తెలిసిందే. అయితే, సరిహద్దు ప్రాంతాల్లో తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆయా గ్రామాల ప్రజలు ఇప్పుడే తమ నివాసాలకు వెళ్లొద్దని కోరుతున్నారు. దాడుల సమయంలో పాక్ ప్రయోగించిన షెల్స్‌ (ఫిరంగి గుండ్లు) చెల్లాచెదురుగా పడి ఉండటం వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu