చంపేస్తా అని బెదిరిస్తున్నారు...

 

తమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటికే ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు నెలకొంటున్న నేపథ్యంలో ఇప్పుడు జయలలిత మేనకోడలు మరో సంచలన ప్రకటన చేశారు. తనను హతమారుస్తామని కొంత మంది బెదిరిస్తున్నారని దీప ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో తన మేనత్త దివంగత జయలలిత ఆశయాలను కొనసాగించేందుకు రాజకీయ రంగ ప్రవేశం చేశానని..  తనను రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకునేందుకు పలువురు పావులు కదిపారని, అయితే వారి ప్రయత్నాలు ఫలించలేదని, వారి కుయుక్తులన్నీ అడ్డుకుని, తాను రాజకీయ రంగప్రవేశం చేశానని చెప్పారు. అంతేకాదు వారి ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఇప్పుడు తనను హతమారుస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని, పీఎంకే వ్యవస్థాపకులు రాందాస్‌ అనుచరులు తనకు ఫోన్ చేసి మరీ బెదిరిస్తున్నారని ఆమె తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu