సీఎం చంద్రబాబు ముందు.. మంత్రి రాంప్రసాద్‌ కన్నీటి పర్యంతం

 

అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని మదనపల్లి జిల్లాకి మార్పుపై మంత్రి రాంప్రసాద్‌రెడ్డి భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. జిల్లా కేంద్రం మార్పు వల్ల ప్రజల్లో ఆందోళన పెరుగుతుందని ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మంత్రిని ఓదార్చి ధైర్యం చెప్పారు. జిల్లా కేంద్రం మార్పు చేయకపోతే భవిష్యత్తులో ఎదురయ్యే సాంకేతిక, పరిపాలనా సమస్యలను ముఖ్యమంత్రి వివరించారు. అలాగే రాయచోటి అభివృద్ధిని తానే ప్రత్యేకంగా చూసుకుంటానని, పట్టణానికి ఎలాంటి నష్టం జరగనివ్వబోనని  సీఎం, మంత్రికి భరోసా ఇచ్చారు. 

సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది.  క్యాబినెట్‌లో 24 అంశాలను ఆమోదించినట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు. విశాఖలో ఆస్పత్రి నిర్మాణానికి భూమి కేటాయింపు, ప్రభుత్వ కార్యాలయాల్లో స్మార్ట్‌మీటర్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. 9 జిల్లాల్లో ఎలాంటి మార్పులు చేయలేదని, 17 జిల్లాల్లో మాత్రం మార్పులు జరిగినట్లు మంత్రి అనగాని వెల్లడించారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu