కుప్పకూలిన చార్టర్డ్ విమానం...ఆరుగురికి గాయాలు

 

ఒడిశాలో పెను ప్రమాదం తప్పింది. రూర్కెలా నుంచి భువనేశ్వర్ బయలుదేరిన ఒక చార్టర్ట్ విమానం, టేకాఫ్ అయిన 10 కిలోమీటర్ల దూరంలో కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో 9 మంది ఉన్నట్లు సమాచారం. ఈ దుర్ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై ఒడిశా రవాణా శాఖ మంత్రి బిభూతి భూషణ్‌ జెనా స్పందించారు. క్షతగాత్రుల పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu