సనాతన ధర్మం క్రూరమైనది. అరాచకమైనది

సీపీఐ నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం క్రూరమైనదనీ, అరాచకమైనదనీ అన్నారు. సనాతన ధర్మాన్ని సమర్ధించే పవన్ కల్యాణ్ ని అయినా మరెవరినైనా సరే శిక్షించాల్సిందేనని నారాయణ అన్నారు. తాజాగా ఆయన విడుదల చేసిన ఓ వీడియోలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ పెళ్లిళ్ల గురించి తానెప్పుడూ మాట్లాడలేదని చెప్పిన నారాయణ సనాతన ధర్మాన్ని నెత్తికెక్కించుకున్న తరువాతే తాను మాట్లాడానన్నారు. అసలు సనాతన ధర్మంలో విడాకులే లేనప్పుడు పవన్ విడాకులు ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు.

  సనాతన ధర్మాన్ని విమర్శించే వారిపై చర్యలు  తీసుకోవాలని పవన్ అంటున్నారు కానీ వాస్తవానికి సనాతన  ధర్మాన్ని  సమర్థించే వారినే  శిక్షించాలని  నారాయణ అన్నారు. సనాతన ధర్మము గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన  సనాతన ధర్మంలో ఒకసారి పెళ్లయిన తర్వాత భర్త ఎంత వేధించినా, అతనితోనే కాపురం చేయాలని, చివరికి భర్త చనిపోతే అదే చితిమంటలో భార్యను కూడా తగలబెడతారనేది సారాంశమని నారాయణ అన్నారు.  సెక్యులరిజాన్ని నాశనం చేసే ఈ సనాతన ధర్మాన్ని పాటించేవారిని శిక్షించాలని, విమర్శించే వారిని కాదని నారాయణ అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu