24 గంటల్లో 24వేలకు పైగా.. మగవారిలోనే ఎక్కువగా...

టెస్టులు చేయకపోవడంతోనే...కరోనా మహమ్మారి విజృంభణ

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తీవ్రంగా ఉంది. ప్రతిరోజు వేలాది పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. వీటిలో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నాయి. తాజాగా ఆదివారం 1590 కేసులు పాజిటివ్ గా వచ్చాయి. జిల్లాలలో కరోనా మహమ్మారి తక్కువగానే ఉంది హైదరాబాదులో మాత్రం దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసులు ఒకసారి పరిశీలిస్తే 1,15,835 పరీక్షలు చేశారు. వీటిలో 23,902 పాజిటివ్ కేసులుగా నమోదయ్యాయి.

మగవారిలోనే ఎక్కువగా...
రాష్ట్రంలో నమోదవుతున్న కేసులో తీరు  పరిశీలిస్తుంటే ఎక్కువగా మగవారిలోని కోవిడ్ వైరస్ సోకుతున్నట్లు  స్పష్టమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 15,559 మంది కరోనా మహ్మమారి బారిన పడ్డారు. ఈ వైరస్ సోకిన వారిలో మహిళల సంఖ్య 8340గా ఉంది.

ఇక వయసుల వారీగా చూసుకుంటే...
20 నుంచి 60 ఏళ్ల మధ్య వారిలోనే ఎక్కువగా ఈ వ్యాధి కనిపిస్తుంది. ముఖ్యంగా మధ్య వయస్సు  వారిలో షుగర్ బీపీ ఉన్నవారికి త్వరగా సోకుతుంది.

24 గంటల్లో 24వేల కేసులు
మనదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ఒక రోజులోనే 248 50 మందిలో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇప్పటివరకు 24గంటల వ్యవధిలో అత్యధికంగా  నమోదు అయిన కేసులు ఇవే. దేశ వ్యాప్తంగా  ఇప్పటివరకు 6.73 లక్షల మంది కోవిద్ వైరస బారిన పడ్డారు.

రష్యా దాటి.....
అత్యధిక కేసులు ఉన్న జాబితాలో పరిశీలిస్తే అమెరికా 29 లక్షలు బ్రెజిల్ 15 లక్షలు రష్యా 6.82 లక్షలుగా ఉంది. రష్యాకు సమీపంలో ఉన్న మన దేశంలో కేసులు మరో 24గంటల్లో రష్యాను దాటేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.

టెస్టులు చేయకపోవడంతోనే...
కరోనా వ్యాప్తి పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు ముమ్మరంగా చేయాల్సి ఉంది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్న వ్యతిరేకత ప్రజల్లో వ్యక్తమవుతుంది. ఎవరికి వ్యాధి ఉందో... ఎవరికి లేదో తెలియని అయోమయపరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వాలు పరీక్షలు వేగవంతం చేస్తే చాలావరకు వ్యాప్తిని అరికట్టవచ్చు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu