సుప్రీంలో కరోనా కలకలం.. తక్షణమే ప్రొటోకాల్ అమలు.. కేసుల విచారణలో జాప్యం?

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. రోజూవారీ పాజిటివ్‌ కేసుల్లో గణనీయంగా పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానంలో కరోనా కలకలం రేగింది. కొందరు న్యాయవాదులు అస్వస్థతకు గురి కావడంతో అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించగా.. పలువురు లాయర్లు, న్యాయవాదులకు కరోనా సోకినట్లు నిర్దారణ అయింది.  

దీంతో సుప్రీంకోర్టు, పరిసరాల్లో కరోనా ఆంక్షలు వెంటనే అమల్లోకి వచ్చాయి. అందరూ మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలంటూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.మరోవైపు గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 7,178 కొత్త కేసులు బయటపడ్డాయి. ఇక మహమ్మారి కారణంగా 24గంటల్లో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 65,683 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కొవిడ్‌ కేసుల పెరుగుదలకు ఎక్సబీబీ.1.16 వేరియంట్‌ కారణమని వైద్య నిపుణులు తెలిపారు. అయితే, కేసుల సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ.. ఈ వేరియంట్‌ మరీ అంత శక్తిమంతమైనది ఏవిూ కాదని పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రజలు రద్దీ ప్రదేశాల్లోకి వెళ్లినపðడు మాస్క్‌లు ధరించడం, చేతులను శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇలా ఉండగా.. సుప్రీం లో కరోనా కలకలం కారణంగా ఈ రోజు ఉదయం   కేసుల విచారణలో జాప్యం చోటు చేసుకుంది.  

ఇలా ఉండగా దేశంలో కరోనా థర్డ్‌వేవ్‌ ముగిసి సాధారణ పరిస్థితులు నెలకొంటున్న వేళ మరో వేరియంట్‌ వణికిస్తోంది. ఫోర్త్‌వేవ్‌ అంటూ సర్వత్రా భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. ఇటీవల ఢిల్లీ తదితర ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు   పెరగగడం ఆందోళన కలిగిస్తోంది. అత్యంత ప్రమాదకరమైన వేరియంట్‌గా భావిస్తున్న  కొత్త వేరియంట్‌ ఇప్పుడు దేశాన్ని చుట్టేస్తోంది. ఈ వేరియంట్‌ కేసులు   కరోనా కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ ప్రమాదకరమైనదే అయినా పెద్దగా మరణాలు సంభవించలేదు. పెద్దగా ఇబ్బంది పెట్టకుండానే థర్డ్‌వేవ్‌ ముగిసింది.

అయితే ఇప్పుడు కేసుల పెరుగుదల ఉధృతి సెకండ్ వేవ్ నాటి పరిస్థితులను స్ఫురింప చేస్తోంది. కేసులు వేగంగా పెరుగుతున్నాయి.  మళ్లీ కరోనా సీజన్‌ మొదలైందా అన్న ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇది ఎండమిక్ కు ముందు దశ అనీ,  అతిగా భయపడటం అనవసరమనీ వైద్య నిపుణులు చెబుతున్నారు.  మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించడం ద్వారా ఎలాంటి ముప్పు లేకుండా ఈ దశ నుంచి బయటపడొచ్చనీ అంటున్నారు.అయితే కరోనా ప్రస్తత వ్యాప్తి తీవ్రతపై ఇంకా ఇంకా శాస్త్రీయమైన స్పష్టత రాలేదు.. ప్రస్తుతం సోకుతున్న కరోనా  లక్షణాలను అనలైజ్ చేసి నిర్ధారించాల్సిన అవసరం ఉంది.  శాస్త్రవేత్తలు ఆ పనిలోనే ఉన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu