పోలీసులపై చేయి చేసుకున్న షర్మిల, విజయమ్మ

వైఎస్సార్టీపీ  ధ్యక్షురాలు షర్మిలపై  పోలీసులు మళ్లీ కేసు నమోదు చేశారు. ఐపీసీ 353, 330 సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు అయింది. నిరుద్యోగ సమస్యలపై హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద సోమవారం ధర్నాకు  షర్మిల సిద్ధమయ్యారు. ఆ క్రమంలో లోటస్‌పాండ్‌లోని ఆమె నివాసం నుంచి ధర్నాకు బయలుదేరే క్రమంలో ఆమెను పోలీసులు అడ్డుకున్నారు.

దీంతో ఆమె.. వాహనం దిగి.. తనను అడ్డుకొన్న పోలీసులతో వాగ్వాదానికి దిగడంతోపాటు వారి పట్ల దురుసుగా ప్రవర్తించారు. పోలీసులపై చేయి కూడా చేసుకున్నారు. అంతే కాకుండా.. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే ఆమె బైఠాయించి తన నిరసనను వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో  షర్మిలను పోలీసులు అరెస్ట్ చేసి.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.  

గత ఏడాది నవంబర్‌లో  షర్మిల వరంగల్ జిల్లాలోని నరసన్నపేటలో తన పాదయాత్ర సమయంలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో.. బేగంపేటలోని గ్రీన్‌ల్యాండ్స్‌లోని సీఎం క్యాంప్ కార్యాలయం ఎదుట ధర్నాకు బయలుదేరడం.. ఆ క్రమంలో పోలీసులు ఆమెను అడ్డుకోని... పంజాగుట్టు పీఎస్‌కు తరలించి.. వైయస్ షర్మిలపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే గతేడాది అక్టోబర్‌లో అందోల్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నాయకుడు క్రాంతికిరణ్‌ని వైయస్ షర్మిల అవమానించే విధంగా మాట్లాడారంటూ.. దళిత సంఘాలు, టీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తూ జోగిపేటలో పోలీసులను ఆశ్రయించారు.

దీంతో వైయస్ షర్మిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పోలీసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇలా ఉండగా షర్మిలను కలుసుకోవడానికి పీఎస్ కు వెళ్లిన విజయమ్మకు పోలీసులు అందుకు అనుమతివ్వకపోవడంతో  ఆమె కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులపై చేయి చేసుకున్నారు. దీంతో ఆమెపై కూడా కేసు నమోదు చేసి అరెస్టు చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu