చెన్నై ఛీర్ గర్ల్స్ ను వేధించిన పోలీసులు
posted on May 13, 2015 4:26PM

చెన్నై సూపర్ కింగ్స్ కు చెందిన ఛీర్ గర్ల్స్ ను రాయపూర్ పోలీసులు తనిఖీ పేరుతో వేధించిన ఘటన వెలుగు చూసింది. చెన్నై ఫ్రాంచైజీకి చెందిన ఛీర్ గర్ల్ నగరంలోని ఒక హోటల్ లో బస చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాయ్‌పూర్‌లోని కొట్వాలీ పోలీస్ స్టేషన్ కు చెందిన పోలీసులు ఛీర్ గర్ల్స్ హోటల్ పై దాడులు నిర్వహించారు. ఛీర్ గర్ల్స్ ఉన్న గదులను దాదాపు గంటపాటు క్షుణ్ణంగా పరిశీలించి, వాళ్లపై ప్రశ్నల వర్షం కురింపిచారు. హోటల్ లో ఉన్న ప్రతి ఒక్కరిని.. ఆఖరికి ఐపీఎల్ మ్యాచ్ ను కవర్ చేయడానికి వచ్చిన జర్నలిస్టులను సైతం వదలకుండా పోలీసులు తనిఖీలు చేశారు. ఇదిలా ఉండగా ఎలాంటి వారెంట్ లేకుండా సోదాలు ఎలా చేస్తారని, మాపట్ల పోలీసుల ప్రవర్తించిన తీరు ఏం బాలేదని ఛీర్ గర్ల్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొట్వాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక హోటల్ లో విదేశీ అమ్మాయిల గురించి సమాచారం రావడంతో తనిఖీలు నిర్వహించామని, ఇది రొటీన్ తనిఖీ మాత్రమేనని సిటీ ఎస్పీ సింగ్ శిశోడియా అన్నారు.