కౌశిక్ రెడ్డిపై తిరగబడ్డ కాంగ్రెస్ శ్రేణులు

ఫైర్ బ్రాండ్ నేత, బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై హన్మకొండ జిల్లా గ్రామ సభలో కాంగ్రెస్ శ్రేణులు తిరగబడ్డారు. గత ఎన్నికలలో బిఆర్ఎస్ ఓటమి తర్వాత ఆ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇది మింగుడు పడని కౌశిక్ రెడ్డి బిఆర్ఎస్ ఎమ్మెల్యేలైన అరికెపూడి గాంధీ, సంజయ్ లపై భౌతిక దాడులు చేసిన సంగతి తెలిసిందే. కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయంలో బిఆర్ఎస్  ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ లో చేరడాన్ని సహించలేని కౌశిక్ రెడ్డి ఆయనపై భౌతిక దాడి చేశారు. ఇదే కేసులో అరెస్టైన కౌశిక్ రెడ్డికి మెజిస్ట్రేట్ కండిషన్ బెయిల్ ఇచ్చారు. గ్రామ సభకు కౌశిక్ రెడ్డి వస్తాడని ఊహించిన కాంగ్రెస్ శ్రేణులు  అతనిపై  టమాటోలు, కోడిగుడ్లు, చెప్పులు విసిరారు. ఈ ఘటన తర్వాత కౌశిక్ రెడ్డి గ్రామ సభ నుంచి అర్ధాంతరంగా వెనుదిరిగారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu