టిఆర్ఎస్,టిడిపిలే లక్ష్యం సరికాదు :జగన్ ఫై నారాయణ
posted on Jan 30, 2012 9:24AM
ఖ
మ్మం: అధికారంలో ఉన్న కాంగ్రెసు పార్టీని వదిలి టిఆర్ఎస్ టిడిపిని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, వైయస్ జగన్ లక్ష్యంగా చేసుకోవడం సరికాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు.ఆయన రాత్రి ఖమ్మంలోని పార్టీ మహాసభలో మాట్లాడుతూ జగన్ చుట్టూ ఉన్న అవినీతిని కాల్చి వేయాలని అన్నారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అధికారంలో కొనసాగటం కోసం ఒక్కొక్కరికి రూ.5 కోట్లు ఇచ్చి ప్రభుత్వాన్ని నిలుపుకోవడం సిగ్గుచేటు అన్నారు. ఉచిత విద్యుత్ పేరుతో రైతులపై మోపిన బిల్లులు వారు చెల్లించలేక పోతున్నారని ఆవేదన చెందారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని అంశాల్లో విఫలమైందని ఆరోపించారు. ఖమ్మం, కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో ఉన్న 1.30 లక్షల వేల ఎకరాలు మైనింగ్ భూములను వైయస్సాఅర్ తన అల్లుడికి కట్టబెట్టారని విమర్శించారు .