విశాఖలో ఐటీ క్యాంపస్ ఏర్పాటు : కాగ్నిజెంట్
posted on Jun 26, 2025 3:06PM

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో కొత్త ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేయబోతున్నట్లు కాగ్నిజెంట్ సంస్థ ప్రకటించింది. కాపులుప్పాడలో 22 ఎకరాల్లో ఈ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. దీని ద్వారా ఏఐ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ రంగాల్లో సుమారుగా 8 వేల మందికి పైగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపింది. 2026 నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తామని, 2029 నాటికి తొలిదశ పూర్తిచేస్తామని ప్రకటించింది.
ఇందుకు సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపింది. రూ. 1,500 కోట్లతో క్యాంపస్‌ను ఏర్పాటు చేయడానికి కాగ్నిజెంట్ కంపెనీకి కుటమి ప్రభుత్వం భూమిని కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ పెట్టుబడి ద్వారా ఎనిమిదేళ్లలో 8,000 ఉద్యోగాలు వస్తాయని అంచనా. కాగ్నిజెంట్ 2029 మార్చి నాటికి కార్యకలాపాలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుందట. వైజాగ్ ఐటీ హబ్‌గా ఎదుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.