తిరుమల యాత్రపై గేమింగ్ యాప్ మోసం
posted on Jun 26, 2025 2:56PM

తిరుమల యాత్రపై గేమింగ్ యాప్ రోబ్‌లాక్స్ సృష్టించి భక్తులను మోసగిస్తున్నది. భక్తుల సెంటిమెంట్ ను ఉపయోగించుకొని సోషియల్ మీడియాలో నయో మోసాలు పాల్పడుతున్నదని జనసేన నేత కిరణ్ రాయల్ తెలిపారు. తిరుమల మీద గేమ్ డిసైన్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కిరణ్ రాయల్, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును కోరారు. దీనిపై స్పందించిన చైర్మన్ వెంటనే చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అధికారులను టీటీడీ చైర్మన్ అదేశించారు. తిరుపతి నుండి తిరుమల ప్రయాణం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి శ్రీవారి ఆలయం, దైవదర్శనం చేసుకొనే దృశ్యాలతో యాప్ రూపొందించిన రోబ్‌లాక్స్ కంపెనీ దైవ భక్తిని...అదును చేసుకొని డాలర్స్ రూపంలో అన్ లైన్ లో వసూలు చేసినట్లు మాకు ఫిర్యాదు అందిందని వారు తెలిపారు.
స్వలాభం కోసం తిరుమల దృశ్యాలతో అక్రమాలను పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.ఈ రోబ్‌లాక్స్ గేమ్‌కు మరింత లోకలైజ్ చేసేందుకు కొందరు స్థానికంగా ఉంటే ప్రాంతాలను రిఫరెన్స్‌గా తీసుకొని గేమ్స్ రన్ చేస్తూ వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. అందుకే అలాంటి వీడియోలకు యూట్యూబ్‌లో మంచి డిమాండ్ ఉంటుంది. ఎంత పెద్ద ఆటంకాలు దాటుకుంటూ వెళ్తే అన్ని వ్యూస్ వస్తాయి. అందుకే దీన్ని లోకలైజ్ చేసి వీడియో వ్యూస్ పెంచుకోవాలని చూస్తున్నారు. శ్రీవారికి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ గేమ్ డిజైన్ చేశారని అన్నారు. శ్రీవారి ఆలయంలో అణువణువు ఎలా ఉంటుంది అని గేమ్ డిజైన్ చేశారని వెంటనే ఆ గేమ్ అకౌంట్ ని తొలగించాలని టిటిడిని కోరాని కిరణ్ రాయల్ తెలిపారు.