పాకిస్తాన్‌లో పేలుడు.. నలుగురు మృతి

 

పాకిస్తాన్‌లోని ఖైబర్‌పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌ లో బాంబు పేలుడు జరిగింది. బుధవారం జరిగిన ఈ ఘటనలో నలుగురు మరణించగా, పలువురికి తీవ్రగాయాలైనట్లు అధికారులు తెలిపారు. పాకిస్తాన్‌-ఆఫ్ఘనిస్తాన్‌ సరిహద్దుకు సమీపంలో ఉన్న అడవిలో బాధితుల్లో ఒకరు పేలుడు పరికరంపై కాలువేయడంతో పేలుడు జరిగిందని అన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టామని, ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశామని ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu