నళినికి సీఎం రేవంత్‌రెడ్డి భరోసా

 

సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాజీ డీఎస్పీ నళినిని కలిశారు. సర్వీసు సమస్యలు ఏమైనా ఉంటే వాటిని త్వరలోనే పరిష్కరస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని తెలంగాణ ప్రభుత్వం నళినికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉందనే విషయాన్ని కలెక్టర్.  వివరించారు. ఈ మేరకు  ముఖ్యమంత్రి సందేశాన్ని ఆమెకు అందజేశారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహాయం అందుతుందని కలెక్టర్ ఆమె భరోసా కల్పించారు. 

నళిని ఫేస్‌బుక్‌లో పంచుకున్న బహిరంగ లేఖపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ఆమె “ఇక నా ప్రయాణం ముగియనుంది” అంటూ రాసిన ఈ లేఖ సీఎం దృష్టికి రాగానే వెంటనే సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా చేసిన నళిని, రాష్ట్ర ప్రజలనుద్దేశించి ఆదివారం ఫేస్‌బుక్‌లో ఓ బహిరంగ లేఖను పోస్టు చేశారు. మరణ వాంగ్మూలంలా కనిపించిన ఆ లేఖలో తన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వివరించారు.


నళిని పేర్కొన్నదాని ప్రకారం ఒక అధికారిణి, ఉద్యమకారిణి, రాజకీయవేత్త, ఆయుర్వేద ఆరోగ్యసేవకురాలు, ఆధ్యాత్మిక సాధకురాలిగా సాగిన నా జీవితం ముగింపు దశలో ఉంది. గత ఎనిమిదేళ్లుగా రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నాను. రెండు నెలలుగా వైరల్ ఫీవర్ వల్ల పరిస్థితి మరింత దిగజారింది. 2018లో ఈ వ్యాధి మొదటగా సోకినప్పుడు హరిద్వార్‌లో రాందేవ్ బాబా పంచకర్మ కేంద్రంలో చికిత్స పొంది కొంత మెరుగయ్యాను. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్లే శక్తి, వనరులు లేవు” అని ఆమె రాసుకున్నారు.ఈ లేఖ బయటకు రావడంతో అధికారులు ఆమెకు తక్షణ వైద్య సహాయం అందించే దిశగా చర్యలు ప్రారంభించినట్టు సమాచారం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu