పీకే టీంతో కేసీఆర్ భేటీ.. అందుకేనా?

దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశ పడుతున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినాయకురాలు మమతా బెనర్జీకే అయినా ఆంధ్ర ప్రదేశ్ లో అధికారం నిలుపుకునేందుకు ఆరాట పడుతున్న జగన్మోహన్ రెడ్డికే  అయినా ఎన్టీఆర్ లాగా ఎంట్రీతోనే అధికార పగ్గాలు చేపట్టాలని ఆశ పడుతున్న వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిలకే అయినా, ఇంకా రాజకీయ అధికారానికి గాలిలో నిచ్చెనలు వేస్తున్న ఇతర నాయకులు, పార్టీలు ఎవరికైనా, చివరకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఒక్కరే దిక్కవుతున్నారు. కొంచెం ముతగ్గా ఉన్నా .. అక్కమొగుడే దిక్కు అన్నట్లుగా, దేశంలో చాలా మంది నాయకులు, పార్టీలకు, రాజకీయ బేహారులకు ప్రశాంత్ కిశోర్, ఆయన బృందమే దికవుతోంది.  

ఇప్పుడు పీకే  క్లైంట్స్ జాబితాలో మరో కొత్త పార్టీ, కొత్త నేత పేరు కూడా వినిపిస్తోంది. అవును అత్యంత విశ్వసనీయ వర్గల సమాచరం మేరకు  పీకే బృందానికి చెందిన నలుగురు సభ్యుల బృందం, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశమైంది. బెంగుళూరుకు చెందిన సురేష్ అనే పీకే టీమ్ లీడర్ సారధ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన ఈ బృందం, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఎన్నికలల్లో తమ క్లైంట్స్ ని గెలిపించేందుకు ఏమి చేస్తారో, ఎలా చేస్తారో, వారి స్ట్రాటజీ ఏమిటో సవివరంగా వివరించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది . పీకేతో తెరాస చర్చలు జరపడం ఇదే మొదటి సారి కాదు. రెండు నెలల క్రితమే మంత్రి కేటీఆర్ నేరుగా పీకేతోనే ఒకటి కంటే ఎక్కువసార్లే కలిసినట్లు తెలుస్తోంది. అప్పుడే, పీకే తో డీల్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిక్స్ అయింది. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం వచ్చిన తర్వాత పరిస్థితినిబట్టి ఫైనల్ నిర్ణయ తీసుకుందామని, అక్కడ ఓ బ్రేక్ తీసుకున్నారని,ఇందుకు సంబదించి ప్రతి అడుగును దగ్గర నుంచి గమనిస్తున్న సన్నిహిత వర్గాల సమాచారంగా తెలుస్తోంది.

హుజూరాబాద్ ‘డస్ట్’ కొంత సర్డుమణిగిన నేపధ్యంలో ముఖ్యమంత్రి కేసేఆర్ సూచనల మేరకు తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కేశవ రావు  మరో ఇద్దరు ఎంపీలు రెండు రోజుల క్రితం ఢిల్లీలో పీకే బృందంతో సమావేశ మయ్యారు. ఢిల్లీలో కేకేతో సమావేశమైన సురేష్ బృందమే, బుధవారం హైదరాబాద్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు పవర్ పాయింట్ ప్రేజెంటేషన్ ద్వారా  ‘స్ట్రాటజీ’ మొత్తం వివరించి నట్లు సమాచారం. అయితే ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనేది మాత్రం ఇంకా స్పష్టంగా తెలియ రాలేదు. 

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీని వరసగా మూడవసారి గెలిపించడంలో కీలక భూమికను పోషించిన పీకే, ఇప్పుడు జాతీయ స్థాయిలో మమతా బెనర్జీ నాయకత్వంలో ప్రాంతీయ  పార్టీలను ఏకం చేసి పనిలో ఉన్నారు. అయితే తెలుగు రాష్ట్రాలో అటు వైసీపీ, ఇటు  తెరాస, వైఎస్సార్ టీపీలతో కుదుర్చుకున్న డీల్, మమతా దీదీతో కుదిరిన హోల్  సేల్  డీల్ లో భాగమా, లేక ఇది సెపరేట్ అది సెపరేట్ ఒప్పందమా అనేది ..కూడా ఇంకా తేల వలసి వుంది. అయితే, పరిణామాలను బట్టి చూస్తే  హుజురాబాద్ ఓటమికి ముందు కుక్కను నిలబెట్టినా గెలుస్తారనే, అతి విశ్వాసం, అహంకారం నుంచి కేసీర్ బయటకు వచ్చారనేది మాత్రం .. నిజం.  

ఇప్పటికే  ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీతో . తెలంగాణలో వైఎస్సార్ టీఎస్ తో డీల్ కుదుర్చుకున్న పీకే టీమ్ ఉభయ తారకంగా ఉండేలా ఉభయ తెలుగు రాష్ట్ర్రాలకు ఉమ్మడి స్ట్రాటజీ కూడా ప్లాన్ చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే, చివరకు ఏమి జరుగుతుంది అనేది ప్రస్తుతానికి అయితే సస్పెన్స్  అంటున్నారు.