థాక్రే బ్రదర్స్ కలయిక ప్రభావం ఎంత?.. బీఎంసీ ఫలితాలకు ముందు సర్వత్రా ఉత్కంఠ!

బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ఫలితాల వేళ సర్వత్రా ఉత్కంఠ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల ఫలితాలు నేడు  శుక్రవారం (జనవరి 16) వెలువడనున్నాయి. గురువారం (జనవరి 16) బీఎసంసీకి జరిగిన ఎన్నికలలో 50 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది.  బీఎంసీ ఫలితాలు రాష్ట్ర రాజకీయాలపై స్పష్టమైన ప్రభావం చూపుతాయన్న అంచనాల నేపథ్యంలో ఈ ఫలిలాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

 అన్నిటికీ మించి దాదాపు రెండు దశాబ్దాల తరువాత తొలి సారిగా ఉద్ధవ్ థాక్రే, రాజ్ థాక్రేలు ఈ ఎన్నికల కోసం చేతులు కలపడంతో బీఎంసీ ఫలితాలపై ఉత్కంఠ మరింత పెరిగింది.  ముంబైపై పట్టు సాధించడమే లక్ష్యంగా థాక్రే బదర్స్ కలవడం ప్రాథాన్యత సంతరించుకుంది. ' ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ-షిండే కూటమి విజయం సాధించే అవకాశం ఉందని తెలినప్పటికీ, థాక్రేల కలయిక నేపథ్యంలో  ఫలితం ఎలా ఉంటుందన్న ఉత్కంఠ ముంబై వాసులలోనే కాకుండా, దేశ వ్యాప్తంగా వ్యక్తం అవుతోంది.  

బీఎంసీతో పాటుగా గురువారం (జనవరి 15) మహారాష్ట్రలో 29 కార్పొరేషన్లకు కూడా ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలు కూడా శుక్రవారమే (జనవరి 16) విడుదల కానున్నాయి. కాగా..  పుణె, పింప్రి-చించ్వాడ్ ప్రాంతాల్లో  మునిసిపల్ ఎన్నికలలో శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాలు కలిసి పోటీ చేశాయి.  జాతీయ స్థాయిలో విభేదాలు ఉన్నప్పటికీ, స్థానిక సంస్థల్లో పట్టు నిలుపుకునేందుకు 'పవార్ ఫ్యామిలీ' ఒక్కటవ్వడం కూడా రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.  అన్నిటికీ మించి ఈ మునిసిపోల్స్ ను పరిశీలకులు అసెంబ్లీ ఎన్నికలకు లిట్మస్ టెస్ట్ గా అభివర్ణిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 29 కార్పొరేషన్లలోని 2,801 సీట్లకు గురువారం (జనవరి 15) పోలింగ్ జరిగింది పోలింగ్ జరిగింది.  ఒక్క బీఎంసీలోనే 227 వార్డులు ఉండగా, అధికారం చేపట్టాలంటే మ్యాజిక్ ఫిగర్ 114. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu