అధికారులకు చంద్రబాబు క్లాస్.. నాకు చెప్పొద్దు..
posted on May 26, 2017 3:40PM
.jpg)
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులకు క్లాస్ పీకడం కామన్. అధికారులు కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అని తెలిస్తే వారికి క్లాస్ తీసుకుంటూనే ఉంటారు. ఇప్పుడు తాజాగా మరోసారి అధికారులకు క్లాస్ పీకారు చంద్రబాబు. అమరావతిలో రెండో రోజు కలెక్టర్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఆయన వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల కొరత ఉందని ప్రతి అధికారి చెబుతుండటంతో ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అవసరమైన చోట్ల ఔట్ సోర్సింగ్ పద్ధతిలో డాక్టర్లను నియమించుకోవాలని సూచించిన ఆయన, ఆ అవకాశం ఇప్పటికే ప్రతి జిల్లా వైద్యాధికారికీ ఇచ్చామని, అయినా సమస్యలను తనదాకా ఎందుకు తీసుకు వస్తున్నారని.. మరోసారి తన వద్ద చెప్పవద్దని మండిపడ్డారు.