"నా ఇటుక - నా అమరావతి".. ఇచ్చేవాళ్ల కంటే చూసేవాళ్లు ఎక్కువ
posted on Oct 17, 2015 12:00PM

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలనే ఉద్యేశ్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన "నా ఇటుక - నా అమరావతి" కి అనూహ్య స్పందని లభించింది. గురువారం చంద్రబాబు చేతుల మీదుగా "నా ఇటుక - నా అమరావతి" పేరుతో ప్రారంభించిన వైబ్ సైటుకు తక్కువ కాలంలోనే ఎక్కువ విరాళాలు పొందారు. శనివారం ఉదయానికి 15వేల మంది ఇటుకల్ని దానం చేశారు. ఇప్పటివరకూ దానం చేసిన ఇటుకల సంఖ్య 10 లక్షలు దాటింది. అయితే ఈ రాజధానికి ఒక్క ఏపీ, తెలంగాణ వారు మాత్రమే కాదు.. విదేశాల్లో స్థిరపడిన వారు కూడా తమవంతుగా విరాళాలు అందించడం గమనార్హం. అంతేకాదు ఉదయం, మద్యాహ్నం, రాత్రి అన్న తేడా లేకుండా విరాళాలు అందిస్తున్నారు. కాగా ఏపీ క్రెడా అందించిన విరాళాన్ని ఇప్పటివరకూ ఎవరూ క్రాస్ చేయలేదు. ఏపీ క్రెడా 52200 ఇటుకల్ని విరాళంగా ఇచ్చింది. క్రెడా తర్వాతి స్థానంలో ఆలూరు శివరామ ప్రసాద్ అనే వ్యక్తి 10116 ఇటుకల్ని, తర్వాతి స్థానంలో గిరిధర్ అనంత 6000 ఇటుకల్ని విరాళం ఇవ్వగా.. ప్రైడ్ ఆఫ్ ఆంధ్ర పేరిట 5558 ఇటుకల్ని విరాళంగా ఇచ్చారు.
అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. వెబ్ సైట్ స్టార్ట్ చేసిన సమయం నుంచి ఇప్పటివరకూ దీనిని 5 లక్షల మంది చూడగా కేవలం 15 వేల మంది మాత్రమే విరాళాలు ఇవ్వడం ఆశ్చర్యకరం.