ఏపీ బ్రాండ్ ప్రోత్సహించడానికి.. సింగపూర్ వెళుతున్నాం : సీఎం చంద్రబాబు

 

సింగపూర్ పర్యటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు. ఏపీకి పెట్టుబడుల రాబట్టడమే ప్రధాన లక్ష్యంగా ఈ రాత్రికి సింగపూర్ వెళుతున్నామని ఎక్స్ వేదికగా సీఎం తెలిపారు. అభివృద్ధిలో తమకు అత్యంత విలువైన భాగస్వామి, శక్తిమంతమైన తెలుగు సమాజానికి నెలవుగా ఉన్న దేశం సింగపూర్ అని కొనియాడారు. "రేపు సింగపూర్ మంత్రులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, తెలుగు డయాస్పొరా సభ్యులను కలవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్థానంలో సింగపూర్ ఒక కీలక భాగస్వామిగా ఉంది. 

ఆసియాలో అత్యంత అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా, దార్శనిక దేశంగా సింగపూర్ వర్థిల్లుతోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. లోతైన సహకారం దిశగా విలువైన అవకాశాలను అందిస్తుంది. మా విశ్వసనీయ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి, అంతర్జాతీయ వేదికపై బ్రాండ్ ఏపీని ప్రోత్సహించడానికి, నూతన ప్రగతిశీల విధానాలను చాటిచెప్పడానికి ఈ పర్యటన ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. అంతేకాదు, సమ్మిళిత వృద్ధి దిశగా శాశ్వత సహకారాలను నెలకొల్పేందుకు ఇదొక అవకాశం" అంటూ సీఎం చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. 

చంద్రబాబు బృందం సింగపూర్ లో 5 రోజుల పాటు పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రముఖ సంస్థల ప్రతినిధులు, ప్రముఖులు, ఇండస్ట్రియలిస్టులతో భేటీ కానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు రాత్రి 11 గంటలకు హైదరాబాద్ నుంచి  సింగపూర్‌కు ముఖ్యమంత్రి వెంట మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్, పి.నారాయణ, ఉన్నతాధికారులు  వెళుతున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu