ఏపీ ఎలక్ట్రానిక్స్‌ పాలసీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్

 

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన  సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ ఎలక్ట్రానిక్స్‌ తయారీ పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.50 వేల కోట్ల పెట్టుబడుల SIPB ప్రతిపాదనలకు ఆమెదం తెలిపారు. సాగుభూమిని వ్యవసాయేతర భూమిగా మార్చే చట్టంగా చర్చించారు. 

పలు సంస్థలకు భూకేటాయింపులకు నిర్ణయం తీసుకున్నారు. విశాఖలో సిఫి సంస్థ రూ.16,466 కోట్లతో డేటా సెంటర్‌ ఏర్పాటు చేయనుంది. మధురవాడలో ఆ సంస్థకు 3.6 ఎకరాలు ఇచ్చేందుకు క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసింది’’అని మంత్రి పార్థసారథి తెలిపారు. 

త్వరలో రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు ఇచ్చే కార్యక్రమం వెంటనే చేపట్టాలని.. ఈ విషయంపై అందరూ దృష్టి సారించాలని మంత్రులకు మార్గనిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు. క్వాంటమ్ వ్యాలీ మాదిరిగా మనం గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీలో కూడా అందరి కంటే ముందు ఉండాలని.. దీనివల్ల మనకు ప్రయోజనం ఎక్కువగా ఉంటుందని చెప్పుకొచ్చారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu