నకిలీ వస్తువుల ఎగుమతిలో టాప్ ప్లేస్ లో ఇండియా..
posted on May 2, 2016 5:09PM

నకిలీ వస్తువులకు చైనా పెట్టింది పేరని మరోసారి రుజువైంది. నకిలీ వస్తువులను అత్యధికంగా ఎగుమతి చేస్తోన్న దేశాల్లో చైనా మరోసారి ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఇండియా ఐదో ప్లేస్లో నిలిచింది. యూరోపియన్ యూనియన్స్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కార్యాలయంతో ఆర్గనైజేషన్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ సంస్థ కలిసి నిర్వహించిన సర్వేలో నకిలీ వస్తువులను అత్యధికంగా ఎగుమతి చేస్తోన్న దేశాల్లో వరసగా చైనా, టర్కీ, సింగపూర్, థాయ్ లాండ్, ఇండియా మొదటి స్థానాల్లో ఉన్నాయి. దీనిలో చైనాకు 63 శాతం నకిలీ వస్తువుల వాణిజ్యం ఉండగా, టర్కీ 3.3శాతం, సింగపూర్ 1.9 శాతం, థాయ్ లాండ్ 1.6 శాతం, భారత్ 1.2 శాతం నకిలీ వస్తువుల వాణిజ్యం చేస్తున్నాయని సర్వే పేర్కొంది.