పొంగులేటి పార్టీ మార్పు రేవంత్ రెడ్డి.. రూ.1,500 కోట్లు ఇస్తే పార్టీ మారరా..?
posted on May 2, 2016 4:50PM
.jpg)
తెలంగాణ నుండి వైసీపీ తరుపున గెలిచిన ఒక్కగానొక్క ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అధికార పార్టీ అయిన టీఆర్ఎస్లోకి చేరుతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈసందర్భంగా పొంగులేటి.. తెలంగాణలో వైసీపీకి మనుగడలేదని.. పార్టీని బతికించడానికి ఎంతో కృషి చేశా.. తెలంగాణలో వైసీపీ వెంట ప్రజలు నడిచే పరిస్థితి లేదని చెప్పుకొచ్చారు. మే నాలుగో తేదీన టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు ప్రకటించారు.
అయితే పొంగులేటి పార్టీ మార్పుపై వస్తున్న వార్తలకు టీటీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆరే పొంగులేటికి బంపర్ ఆఫర్ ఇచ్చి పార్టీలోకి తీసుకున్నారని.. పొంగులేటికి రూ.1,500 కోట్లు ఎరవేస్తే పార్టీ మారడం ఏమిటి..? వైకాపానే తెరాసలోకి విలీనం చేయరా? అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో తన పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీ కొనుగోలు చేస్తుందని తీవ్ర విమర్శలు గుప్పించిన వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో తన పార్టీ నేతల ఫిరాయింపులపై ఎందుకు నోరెత్తలేదని అడిగారు.