చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి షాక్.. బెయిల్ పిటిషన్ కొట్టివేత
posted on Jul 28, 2025 9:09PM

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. లిక్కర్ స్కామ్ కేసులో ఆయన వేసిన బెయిల్ పిటిషన్‌ను విజయవాడలోని ఏసీబీ కోర్టు కొట్టివేసింది. మరోవైపు మద్యం ముడుపుల కేసులో పరారీలో ఉన్న నిందితులపై నాన్‌బెయిలబుల్ అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయి.
పరారీలో ఉన్న 12 మంది అరెస్టుకు వారెంట్ జారీ చేయాలని సిట్ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం.. వారి అరెస్టుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో అవినాష్‌రెడ్డి, పురుషోత్తం, అనిరుధ్‌రెడ్డి, షేక్ సైఫ్, ఈశ్వర్ కిరణ్‌కుమార్‌రెడ్డి, బొల్లారం శివ, రాజీవ్‌ప్రతాప్ సహా పలువురు నిందితులుగా ఉన్నారు.
గత వైసీపీ హయాంలో మద్యం అమ్మకాల్లో అక్రమాలు జరిగాయని.. డిస్టిలరీలు, లిక్కర్ సరఫరా కంపెనీల నుంచి ముడుపులు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఏ38గా ఉన్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని జూన్ నెలలో సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. చెవిరెడ్డిని అతని అనుచరుడు వెంకటేష్ నాయుడును బెంగళూరులో అదుపులోకి తీసుకున్న సంగతి విదితమే